Inspiring Success Story : బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యానిలా..

జీవితం ఎవ్వరికీ అనుకులంగా ఉండ‌దు. మ‌రి పేదరికంలో పుట్టిన వారి జీవితం మ‌రి దుర్బ‌లంగా ఉంటుంది. పేదవాడు కావాలనుకున్న ప్రతీదాని కోసం ఓ పోరాటం చేయాల్సి వస్తుంది.
Manoj Kumar Sharma, IPS

కలలు పెద్దవి అయ్యేకొద్దీ పోరాటం కొండను ఢీకొన్నట్లుగా ఉంటుంది. ఈ స‌రిగ్గా ఇలాంటి స్టోరీనే మ‌నోజ్‌ది. మనోజ్ తన జీవితంలో చాలా అడ్డంకులను ఎదుర్కొన్నారు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన మనోజ్.. పేదరికంతోనే పెరిగారు. రాత్రి సమయంలో బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు కూడా చ‌లా ఉన్నాయి ఆయన జీవితంలో. ఇలా ఎన్నో క‌ష్టాలు ప‌డి చ‌దుతూ.. నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 121వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయ్యాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్ అధికారి మ‌నోజ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

☛➤ Women IAS Success Story : ఫెయిల్ అవుతునే ఉన్నా.. కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం ఆప‌లేదు.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా..

కుటుంబ నేప‌థ్యం : 
మ‌నోజ్ శర్మది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరెనా జిల్లాలో ఓ మారుమూల గ్రామం. ఈయ‌న ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. పోలీస్‌ కావాలని చిన్నప్పటినుంచి కలలు కన్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చదువు విషయంలో ఆయనకు అంతా వింతగా ఉండేది. చదువు సరిగా అబ్బలేదు. 

ఎడ్యుకేష‌న్‌లో ఫెయిల్ అవుతూ..

మ‌నోజ్.. 10వ తరగతి థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియేట్‌లో హిందీ సబ్జెక్ట్ తప్ప అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్ అయ్యారు. అయినా వెనక్కు తగ్గలేదు. తర్వాత పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి ఫెయిల్‌ అయిన అన్ని పరీక్షల్లో ఫాస్‌ అయ్యారు. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ను నాలుగు సార్లు రాసి మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్‌.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

చిన్నప్పటి నుంచి పేదరికంలో మగ్గుతూ జీవితం సాగించిన మనోజ్ శర్మ ఎప్పుడూ కుంగిపోలేదు. తన పరాజయాలను సోపానాలుగా చేసుకుని మరింత పట్టుదలతో చదివారు. తమ జీవితంలో ఏ చిన్న కష్టము వచ్చినా పలాయన మంత్రం పఠిస్తూ.. ఒకొక్కసారి జీవితాన్ని అంతం చేసుకుంటారు కూడా.. ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు కొందరు ఇంటర్ స్టూడెంట్స్. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించలేదని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నతల్లిదండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నారు.

IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

కష్టాలను గుణపాఠాలు నేర్చుకుని..

పడి లేచే అలలను కొందరు ఆదర్శంగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకువెళ్తారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. అదే సమయంలో ఇంకొందరు.. తమ జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా పలాయన మంత్రం పఠిస్తూ.. ఒకొక్కసారి జీవితాన్ని అంతం చేసుకుంటారు కూడా. ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు కొందరు ఇంటర్ స్టూడెంట్స్. 

మూడు సార్లు ఫెయిల్‌.. చివ‌రికి..

యూనియన్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) సివిల్స్ ప‌రీక్ష‌ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఉత్తీర్ణత సాధించడం కష్టతరమైన పరీక్షలలో ఇది ఒకటి. అంతేకాదు చాలా అరుదుగా అభ్యర్థులు మొదటి ప్రయాణంలో పరీక్షను ఛేదిస్తారు. కొందరు రాత‌పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు.. కానీ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేరు. మరికొందరు మొదటి ప్రయాణంలో రెండింటిలోనూ ఉత్తీర్ణులవుతారు. 

అదే సమయంలో యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కలను కంటూ.. తాము కన్న కలను నెరవేర్చుకోవడం కోసం ఒకసారి రెండు సార్లు కాదు.. తమ లక్ష్యం సాధించే వరకూ ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించారు.

➤☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

చిన్ననాటి స్నేహితురాలితో..

మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్‌మేట్ ఇప్పుడు జీవిత భాగస్వామి శ్రద్ధ.. అన్నివిధాలా మనోజ్ కు అండగా నిలబడ్డారు. UPSC పరీక్షలో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ సహాయం చేసింది. మనోజ్ 12వ తరగతి చదువుతున్న సమయంలో శ్రద్ధను కలిశారు. తన ప్రేమను చెప్పడానికి సంకోచించారు. అనంతరం మనోజ్ శ్రద్ధకు తన ప్రేమని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు.

☛ Success Story : నా జీవితాన్ని ఈ కోణంలో చూశా.. యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టానిలా..

బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు ఎన్నో..

మనోజ్ తన జీవితంలో చాలా అడ్డంకులను ఎదుర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన మనోజ్.. పేదరికంతోనే పెరిగారు. రాత్రి సమయంలో బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. యూపీఎస్సీ పరీక్షలో మూడుసార్లు విఫలమయ్యారు. నాలుగో ప్రయత్నంలో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ టాపర్ మనోజ్ శర్మ ముంబై పోలీస్‌ శాఖలో  అదనపు కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై న‌డిచేలా చేశాయ్‌.. నా వైకల్యం కారణంగా..

నా వాళ్లు అనుకున్న వాళ్లే..

నా వాళ్లు అనుకున్న వాళ్లను మనోజ్‌ శర్మ ఎప్పుడూ వదులుకోలేదు. యూపీఎస్సీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలో తనకు అన్ని విషయాలలో సాయం చేసి, అండగా నిలబడిన చిన్ననాటి స్నేహితురాలు శ్రద్ధను జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మనోజ్‌ సెక్సెస్‌ స్టోరీపై “ట్వెల్త్‌ ఫెయిల్” అనే పుస్తకం కూడా వెలువడింది.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

#Tags