FMGE June 2023/Exam: స్వదేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి అవకాశం మెడికల్‌ ప్రాక్టీస్‌కు ఎఫ్‌ఎంజీఈ

ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌.. సంక్షిప్తంగా ఎఫ్‌ఎంజీఈ. ఇది విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసుకున్న అభ్యర్థులు స్వదేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి అవకాశం కల్పించే పరీక్ష. ఇందులో అర్హత సాధిస్తే.. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)లో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎస్‌బీఈఎంఎస్‌).. ఏటా రెండుసార్లు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌ఎంజీఈ-2023 జూన్‌ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఎఫ్‌ఎంజీఈకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర వివరాలు..

అర్హతలు

  • ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారతీయులు లేదా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారై ఉండాలి. వీరు విదేశాల్లో ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన విద్య ఉత్తీర్ణులవ్వాలి.
  • ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించిన వారు లేదా ఆయా దేశాల్లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనుమతి లభించిన అభ్యర్థులకు ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంది. వారు నేరుగా ఎంసీఐ/ఎస్‌ఎంసీలో సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. 
  • పాకిస్తాన్‌లో మెడిసిన్‌ పూర్తి చేసిన వారు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

పరీక్ష విధానం

  • ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో రెండు పార్ట్‌లుగా నిర్వహిస్తారు. 
  • మొత్తం 300 ప్రశ్నలు-300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి పార్ట్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో అడుగుతారు.
  • ఒక్కో పార్ట్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. రెండు పార్ట్‌లకు కలిపి మొత్తం పరీక్ష సమయం 300 నిమిషాలు. రుణాత్మక మార్కులు లేవు.
  • ఈ పరీక్షల్లో అర్హత సాధించాలంటే.. మొత్తం 300 మార్కులకు గాను కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 20.06.2023
  • అడ్మిట్‌ కార్డ్‌ల జారీ: 25.07.2023
  • పరీక్ష తేదీ: 30.07.2023
  • వెబ్‌సైట్‌: https://natboard.edu.in/

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

#Tags