World Bank Team: సీఎం రేవంత్‌రెడ్డితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ
గత నెలలో వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కె, డిజిటల్ డెవలప్‌మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
Rani Kumudini: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
విద్యా, వైద్య రంగాల్లో రేవంత్‌రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్ రైజర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు.
Tags
- cm revanth reddy
- World Bank
- Martin Reiser
- Educational
- Medical
- Irrigation Sectors
- Telangana Government
- Sakshi Education Updates
- WorldBankDelegation
- TelanganaDevelopment
- RevanthReddy
- UrbanInfrastructure
- EducationSector
- MedicalSector
- IrrigationProjects
- GovernmentPriorities
- DevelopmentInitiatives
- TelanganaGrowth