After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

HCL Tech B Program Notification details here

ఐటీ కొలువు సంపాదించాలంటే .. ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీలు పూర్తి చేసుండాలి అనే అభిప్రాయం నెలకొంది. కాని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. ఇంటర్‌ పూర్తిచేస్తే చాలు ఐటీ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌ ద్వారా.. ఎంట్రీ లెవల్‌ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తోంది. ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఈ టెక్‌బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక సమాచారం...

  • హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌ ద్వారా అవకాశం

అర్హతలు

  • హెచ్‌సీఎల్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సును 2021, 2022లో పూర్తిచేసి ఉండాలి.
  • కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ స్థాయిలో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌ కెరీర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు.

What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో 

ఫీజు ఎంత

టెక్‌ బీ 2022 ప్రోగ్రామ్‌ ఐటీ సర్వీసెస్, అసోసియేట్‌ ట్రైనింగ్‌ కాలవ్యవధి 12 నెలలు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్‌ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది.

మినహాయింపు

ట్రైనింగ్‌లో 90శాతం, అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు ప్రోగ్రామ్‌ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. 85–90 శాతం వరకు స్కోరు చేసిన వారికి 50శాతం ఫీజు రాయితీ ఇస్తారు.

Career Opportunities with Internship: ఇంటర్న్‌షిప్‌.. కెరీర్‌కు ధీమా!

సెలక్షన్‌.. ట్రైనింగ్‌

  • ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులను ఐటీ రంగంవైపు ప్రోత్సహించేలా హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులను లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, నాగపూర్‌ల్లోని కేంద్రాల్లో శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణ ‘ఐటీ సర్వీసెస్‌ , అసోసియేట్‌’ అని రెండు విభాగాలుగా అందిస్తారు. వీటి ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను ఇస్తారు.
  • ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ అసెస్‌మెంట్లు, చర్చలు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్‌ వంటివి ఉంటాయి.

మూడు దశల్లో

ఫౌండేషన్, టెక్నాలజీ/డొమైన్‌ ట్రైనింగ్, ఫ్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ ట్రైనింగ్‌ అని మూడు దశల్లో కోర్సు ఉంటుంది.

After Inter: సరైన కెరీర్‌కు సోపానాలు..

శిక్షణ తర్వాత

ట్రైనింగ్‌ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. 

స్టయిపెండ్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిపెండ్‌ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం రూ.1.70లక్షల నుంచి రూ.2.20లక్షల వరకు ఉంటుంది.

ఉన్నత విద్యకు అవకాశం

  • హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్‌ పిలానీ ,అమిటీ యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సుల్లో చేరే అవకాశం కూడా ఉంది.
  • దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.hcltechbee.com/

Tech Skills: ఎథికల్‌ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్‌.. అర్హతలు, నైపుణ్యాలు..

#Tags