School Holidays: సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

విశాఖ విద్య: సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించే స్కూళ్లు గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ ఆర్జేడీ ఎం.జ్యోతి కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యా క్యాలెండర్‌ మేరకు జ‌నవ‌రి 18 వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సిందేనన్నారు.

చదవండి: Holidays: ఇంటర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు

నిబంధనలు అతిక్రమించినట్లు తెలిస్తే, సంబంధిత పాఠశాలల గుర్తింపు రద్దుతో పాటు, యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలకు సిఫార్సు చేస్తామన్నారు. ఈ విషయంలో డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలు తగిన దృష్టి పెట్టాలన్నారు.

#Tags