Skip to main content

AP 10th Class Results 2024 Live Updates : బ్రేకింగ్‌ న్యూస్‌.. నేడే టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్ చూడొచ్చు.

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష ఫ‌లితాలను నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సురేష్ కుమార్ ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు. టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో అత్యంత త్వ‌రగానే ముగిసింది. ఈ ఏడాది రికార్డుస్ధాయిలో కేవ‌లం 22 రోజుల్లోనే టెన్త్‌ ఫలితాలను చేస్తున్న‌ట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించనుంది. 2024 మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. టెన్త్‌ పరీక్షలకు మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Record-breaking Class 10 Results Evaluation   Release of Class 10 Results in Vijayawada  Fastest Evaluation of TENTH Answer Sheets  AP Tenth Class Results 2024 Release Date and Time  Andhra Pradesh Class 10 Public Examination Results Announcement

ఈ ఏపీ టెన్త్ ఫ‌లితాల‌ను ఒకే ఒక్క క్లిక్‌తో అంద‌రి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

AP SSC 10th Class Results 2024 Direct Links

SERVER-1      

 
47,88,738 జవాబు పత్రాలను..
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వేల్యూయేషన్‌) విజయవంతంగా ముగిసింది. 2024 మార్చి 30వ తేదీతో పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీన మూల్యాంకనం ప్రారంభమైంది. ఎస్సెస్సీ బోర్డు పరీక్షల విభాగం ముందే ప్రకటించిన ప్రణాళిక మేరకు మొత్తం ప్రక్రియ పూర్తయినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 26 జిల్లాల్లో 25 వేలమంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్టు తెలిపారు. 

☛ After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

☛ Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

ఈ ఏడాది మూల్యాంకనం..

ఏపీలో పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్‌ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.

How to check TS 10th Class Results 2024:

It's simple! Just follow these steps

  • Visit https://results.sakshieducation.com/ or sakshieducation.com.
  • Click on the "TS SSC Results 2024" link available on the home page.
  • Enter your hall ticket number and click on submit button.
  • The 10th class marks will be displayed.
  • Take print and save a copy for further use.

చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

 Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

Published date : 22 Apr 2024 11:33AM

Photo Stories