Skill Development: స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సొంత భవనం

ఇటీవలె, నిర్మించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనాలను మంగళవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యక్రమంలో మాట్లాడారు..

కర్నూలు(అర్బన్‌)నగర శివారులోని బి. తాండ్రపాడు సమీపంలో ఉన్న ఐటీఐ ప్రాంగణంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో రూ.70 లక్షల అంచనాతో నిర్మించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఇలాంటి 10 భవనాలను మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. బి. తాండ్రపాడు ఐటీఐ ప్రాంగణంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ డీఈఈ గోన నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌. ప్రసాదరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు.

TS Tenth Class: పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన

ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.70 లక్షలు వెచ్చించి అన్ని హంగులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు సొంత భవనం నిర్మించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఇంద్రావతమ్మ, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ ఎం లక్ష్మీనారాయణ, ఏఈ రఘుమధుమోహన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రామాంజనేయులు, కాంట్రాక్టర్‌ రామసుబ్బారెడ్డి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

 Technical Education: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక విద్య

#Tags