TS Tenth Class: పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన
Sakshi Education
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన
మన్ననూర్: పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. మంగళవారం మన్ననూర్ గిరిజన ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన ప్రీఫైనల్ గణిత పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. గతేడాది ప్రశ్నపత్రాలను విద్యార్థులకు చూయించి, పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా చూడాలన్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు మరింత కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అమ్రాబాద్, పదర కేజీబీవీ, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి షర్పుద్దీన్, నోడల్ అధికారి సిద్ధార్థ మహదేవ్ పాల్గొన్నారు.