Flash floods: అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. పోయిన 68 మంది ప్రాణాలు!!
Sakshi Education
అఫ్గానిస్తాన్‌లో మరోసారి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.
ఈ వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబాన్ అధికారులు మే 18వ తేదీ వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్‌పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది.
ప్రభావిత ప్రాంతాలు ఇవే..
ఘోర్ ప్రావిన్స్: ఈ ప్రావిన్స్‌లో అత్యధికంగా 50 మంది మరణించారు. వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి.
ఫరాయాబ్ ప్రావిన్స్: ఈ ప్రావిన్స్‌లో 18 మంది మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. 4 జిల్లాల్లో వరదలు విస్తృతంగా నష్టాన్ని కలిగించాయి. 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయి.
Global Burden of Disease: శుభవార్త.. పెరుగుతున్న మనుషుల సగటు జీవితకాలం!!
Published date : 20 May 2024 03:59PM