Skip to main content

TS EdCET Admit Card: టీఎస్ఈడీ సెట్ 2024 అడ్మిట్ కార్డ్ విడుద‌ల‌..

ప్ర‌వేశ ప‌రీక్ష కోసం విడుద‌లైన అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
Admission Test for Bachelor of Education in Telangana Universities  Download Your TSED Admit Card Now  Download the TS Ed CET 2024 Entrance exam hall ticket  Telangana State Education Entrance Test

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్రంలోని విశ్వావిద్యాల‌యాలు అందించే బ్యాచిల‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌లో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హిస్తున్న ప్ర‌వేశ ప‌రీక్ష టీఎస్ఈడీ సెట్. ఇందుకు ఈనెల 23వ తేదీ (గురువారం) జర‌గ‌నున్న‌ టీఎస్ఈడీ సెట్ ప‌రీక్ష‌కు సంబంధించి అడ్మిట్ కార్డును నేడు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుద‌ల‌ చేసింది . ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థులు ఈ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.

IGNOU Admissions: ఇగ్నోలో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఈ ప‌రీక్ష‌ను మే 23న రెండు సెష‌న్ల‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఒక‌టి.. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు. మ‌రొక‌టి.. మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

1. ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి edcet.tsche.ac.in

2. హోం పేజీలో క‌నిపిస్తున్న టీఎస్ ఈడీసెట్ 2024 అడ్మిట్ కార్డ్‌పై క్లిక్ చేయండి.

3. అందులో కావాల్సిన లాగిన్‌ వివ‌రాల‌ను న‌మోదు చేసి స‌మ‌ర్పించండి.

4. ఇప్పుడు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉన్న‌ మీ హాల్‌టికెట్‌ను మీరు ప‌రిశీలించుకొవ‌చ్చు.

5. ఇప్పుడు మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

TS ECET Results 2024: టీఎస్‌ ఈసెట్‌ 2024 ఫలితాలు విడుద‌ల‌.. ఒక్కే ఒక్క క్లిక్‌తో రిజల్స్‌ కోసం డైరెక్ట్‌ లింక్ ఇదే..

Published date : 20 May 2024 03:13PM

Photo Stories