Skip to main content

IAS Foundation Classes: రేప‌టి నుంచి ఐఏఎస్ ఫౌండేష‌న్ త‌ర‌గ‌తులు ప్రారంభం.. అర్హులు వీరే!

పాఠ‌శాల స్థాయి విద్యార్థులకు ప్ర‌క‌టించిన తేదీ స‌మ‌యం ఆధారంగా ఐఏఎస్ ఫౌండేష‌న్ త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయి. ద‌ర‌ఖాస్తులు ఈ విధంగా చేసుకోండి..
IAS Foundation Classes for tenth and above students

గుంటూరు: పాఠశాల స్థాయి విద్యార్థులకు మంగళవారం నుంచి ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, స్టూడెంట్‌ యూనియన్‌ ఫర్‌ నేషన్‌ కన్వీనర్‌ కె.సాయికుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాడీపేట యూటీఎఫ్‌ సమావేశ మందిరంలో సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు నిర్వహించే ఈ ఉచిత ఐఏఎస్‌ ఫౌండేషన్‌ శిక్షణ తరగతులకు పదో తరగతి ఆపైన చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకులు, ఉన్నత అధికారులతో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల పేర్లు రిజిస్ట్రేషన్‌ కోసం 7207566 702, 6309481514, 86888 97406 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశానికి స్పాట్‌ కౌన్సెలింగ్‌

Published date : 21 May 2024 11:24AM

Photo Stories