JEE Mains Rankers: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తిరుమల విద్యార్థులు..
రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక జేఈఈ(మెయిన్) బి–ఆర్క్ అండ్ బి–ప్లాన్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. బి ప్లానింగ్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించి మరోసారి శ్రీ తిరుమల శ్రీ విద్యార్థులు తమ సత్తా చాటారని ఆయన అన్నారు.
Blue Origin: 60 ఏళ్ల తర్వాత.. ఎట్టకేలకు నెరవేరిన కల..!
కె.సాకేత్ ప్రణవ్ ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు, వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తమ విద్యార్థులు కేజే వెంకటసాయి 2వ ర్యాంకు, పప్పుల దినేష్ 8వ ర్యాంకు, కేవీ సత్యనీలచలం 8వ ర్యాంకు, ఎంఎన్.మణికంఠ 15వ ర్యాంకు, ఎంజీ వెంకటమహేష్ 15వ ర్యాంకు, జీఎన్.వెంకటసాయికృష్ణ 18వ ర్యాంకు, ఎన్.రాజీవ్ 20వ ర్యాంకు సాధించడంతో పాటు, 23, 24, 25, 26, 31, 32, 36, 40, 44, 50 ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు.
బి–ఆర్క్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తాటిపాక ఆదిత్య 4వ ర్యాంకు, కె.సాకేత్ ప్రణవ్ 5వ ర్యాంకు, కేజే వెంకటసాయి 5వ ర్యాంకు, పప్పుల దినేష్ 14వ ర్యాంకు, జీఎన్.వెంకటదుర్గాసాయి 17వ ర్యాంకు సాధించడంతో పాటుగా 21, 27, 35, 36, 40, 43 ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.
District Judge Posts: తెలంగాణలో డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులు..
Tags
- JEE Mains Results
- rankers
- students talent
- Tirumala Education Institutions
- national level
- students ranks
- Institute Chairman Tirumala Rao
- Top rankers of JEE Mains 2024
- JEE Mains Exam Results 2024
- JEE Mains
- Education News
- Sakshi Education News
- East Godavari District News
- rajamahendravaram
- EducationalInstitutions
- achievements
- Results