Bill Gates And Steve Jobs Resumes Goes Viral: బిల్‌గేట్స్, స్టీవ్ జాబ్స్‌ల రెజ్యూమ్‌లు నెట్టింట వైరల్.. అప్పట్లోనే వీళ్ల జీతం తెలిస్తే షాక్ అవుతారు!
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.
స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.
TGPSC Group 1 Mains Exam: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. అభ్యర్థుల డిమాండ్!
ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్‌లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 1970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.
Wipro Cuts Offer Letters To Freshers: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. ఆ నియామకాలన్నీ రద్దు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM
— Jon Erlichman (@JonErlichman) August 27, 2024