Skip to main content

Gopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగోడు.. తొలి భారత స్పేస్‌ టూరిస్ట్ ఈయ‌నే..!

తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు.
Gopi Thotakura to be the first Indian Space Tourist  Second Indian Astronaut in Space

అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్‌ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు.. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 
1984లో భారత సైన్యానికి చెందిన వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేశారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్‌ ప్రైవేట్‌ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. 

ఇందులో భాగంగా ఏడో హ్యూమన్‌ ఫ్లైట్‌ ‘ఎన్‌–25’ మే 19వ తేదీ అమెరికాలోని వెస్ట్‌ టెక్సాస్‌ లాంచ్‌ సైట్‌ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్‌లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్‌ సరిహద్దు రేఖ అయిన కర్మాన్‌ లైన్‌ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్‌ లైన్‌ ఉంటుంది. 

First Indian Tourist In Space: సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆరుగురు వ్యక్తులు వీరే..

బ్లూ ఆరిజిన్‌ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్‌ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్‌ లైఫ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్‌ మెడికల్‌ జెట్‌ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ కిలిమంజారోను అధిరోహించారు.

Rakesh Sharma: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఈయ‌నే.. ఈ యాత్రకు 40 ఏళ్లు!!

Published date : 20 May 2024 12:25PM

Photo Stories