Skip to main content

Rakesh Sharma: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఈయ‌నే.. ఈ యాత్రకు 40 ఏళ్లు!!

1984 ఏప్రిల్ 3న భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది.
Rakesh Sharma in Space Suit  Celebrating 40 Years Of Rakesh Sharma becoming first Indian in Outer Space

ఈ రోజు సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. 3 ఏప్రిల్ 2024, అంతరిక్షంలో రాకేశ్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్‌కు 40 ఏళ్లు పూర్తయ్యాయి.

రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 ఎక్స్‌పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం 6.18 IST గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.. ప్రయోగించిన తర్వాత Orbital Module రష్యా అంతరిక్ష కేంద్రానికి "Salyut 7" డాక్ చేయబడింది. రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సోయుజ్ T-10 సహాయంతో 11 ఏప్రిల్ 1984న సాయంత్రం 4.18p.m IST సమయంలో భూమికి తిరిగి వచ్చారు.

Indian Navy: 23 మంది పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ

ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్ ప్రారంభించబడింది: రాకేష్ శర్మ యొక్క మిషన్ రాబోయే గగన్‌యాన్ గురించి అవగాహన కల్పించడానికి. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్‌తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం  ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది.

ముఖ్యంగా NASADIYA(నాసదీయ) అనే ఆస్ట్రానమీ, స్పేస్ టెక్ క్లబ్‌ను రిటైర్డ్ ISRO సీనియర్ సైంటిస్ట్ Er రామకృష్ణ పాఠశాలలో ప్రారంభించారు. ఎన్.శ్రీ రఘునందన్ కుమార్ డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు స్కూల్ డైరెక్టర్లు ఎన్.రేవతి రాజు & యామిని రాజు, ఏజేఎస్ ప్రకాష్ బిజినెస్ హెడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు,  క్లబ్ సభ్యులు హాజరయ్యారు.

Indian Navy: నావికా దళంలోకి రెండు యుద్ధ నౌకలు

Published date : 04 Apr 2024 05:36PM

Photo Stories