Skip to main content

Collector Venkatesh Dotre: సెలవుల్లో పనులు పూర్తి చేయాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేయాల ని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు.
Work should be completed during holidays

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌తో కలిసి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2024– 25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

చదవండి: 10th class news: 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌...

జిల్లాలోని 685 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమై న తాగునీరు, విద్యుత్‌, బోర్‌వెల్స్‌, ఇతర మరమ్మతులు చేపట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేక మూ త్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా యూనిఫాంలు అందించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో నోడల్‌ అధికారి భరత్‌, డీఆర్‌డీవో సురేందర్‌, ఇంజనీరింగ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Published date : 21 May 2024 11:26AM

Photo Stories