NCPCR: స్కూళ్ల‌కు అలా వ‌స్తే అనుమ‌తించాల్సిందే.. పాఠ‌శాల‌ల‌ను ఆదేశించిన ఎన్‌సీపీసీఆర్‌

రక్షా బంధన్ లేదా ఇత‌ర పండుగ‌ల‌ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు రాఖీలు క‌ట్టుకోవ‌డం, నుదిటిపై తిల‌కం దిద్దుకోవ‌డం, చేతుల‌కు మెహందీ లేదా గోరింటాకు లాంటివి పెట్టుకుని వ‌స్తే వారిని శిక్షించవద్దని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) పాఠశాలలకు సూచించింది.
స్కూళ్ల‌కు అలా వ‌స్తే అనుమ‌తించాల్సిందే.. పాఠ‌శాల‌ల‌ను ఆదేశించిన ఎన్‌సీపీసీఆర్‌

పాఠ‌శాల‌ల్లో పండుగలు సెల‌బ్రేట్ చేసుకునే స‌మ‌యంలో విద్యార్థుల‌కు ఉపాధ్యాయుల నుంచి వేధింపులు ఎదుర‌వుతున్న‌ట్లు కొన్నేళ్లుగా కమిషన్ ద‌`ష్టికి ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాలల‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు నూత‌న స‌ర్క్యుల‌ర్‌ జారీ చేసింది.

ఇవీ చ‌ద‌వండి: కార్మికుల‌కు శుభ‌వార్త‌... 30 కంటే లీవ్స్‌ ఎక్కువ ఉంటే డబ్బులు చెల్లించాల్సిందే.. ..!

త‌మ సూచ‌న‌ల‌ను పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కార్య‌ద‌ర్శుల‌కు సూచించింది. పండుగ‌ల సంద‌ర్భంగా విద్యార్థుల‌ను శిక్షించిన‌ట్లు త‌మ ద‌`ష్టికి వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది. 

విద్యాహక్కు చట్టం-2009 లోని సెక్షన్ 17 ప్రకారం పాఠశాలల్లో విద్యార్థుల‌కు శారీరక దండన నిషిద్ధమ‌ని ఎన్సీపీసీఆర్ స్ప‌ష్టం చేసింది. ఉత్సవాల్లో పాల్గొన్నంత మాత్రాన పిల్లలను శారీరకంగా శిక్షించడం లేదా వివక్షకు గురిచేయ‌డం లాంటి ఆచారాన్ని పాఠశాలలు పాటించకుండా చూడాలని సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ అధికారులను కోరింది.

ఇవీ చ‌ద‌వండి: AP 10th Class సోషల్ స్టడీస్ మోడల్ పేపర్స్...ముఖ్యమైన టాపిక్స్ కోసం క్లిక్ చేయండి!

#Tags