School Education Department: అత్యుత్తమ బోధన అందించాలి
ఏప్రిల్ 23తో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తుందని, జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఈ మధ్య 47 రోజుల సమయాన్ని విద్యా బోధనలో అత్యున్నత మెలకువలను సాధించేందుకు వినియోగించాలని సూచించారు.
చదవండి: Gurukula students: గురుకుల విద్యార్థులకు స్లైడింగ్ ఆప్షన్
ప్రముఖ విద్యావేత్త డౌగ్ లెమోవ్ రాసిన ‘టీచ్ లైక్ ఏ చాంపియన్’ పుస్తకం (పుస్తకాం కోసం లింక్‌లో https://teachlikeachampion.org/reso urces/grab-and-go/) ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాలని కోరారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దాదాపు 49 బోధనా పద్ధతులు నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నా రు. తద్వారా ప్రభావవంతమైన ఉపాధ్యాయులుగా తమను తాము మార్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: TET: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి