TET: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఏప్రిల్ 17న ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీటీఈ నుంచి సవరణ ఉత్తర్వులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్ పేపర్స్ | TS TET ప్రివియస్ పేపర్స్
ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మెడికల్, జీపీఎఫ్, సరెండర్ బిల్లులను విడుదల చేయాలన్నారు.
కార్యక్రమంలో టీపీఆర్టీయూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, రాకేష్‌రెడ్డి, సతీష్‌కుమార్, శ్రీధర్, భూపతిసింగ్ తదితరులు పాల్గొన్నారు.