kakatiya university: దూరవిద్య ప్రవేశాల గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి దూర విద్యా కేంద్రంలో 2023–24లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును నవంబర్‌ 7 వరకు పొడిగించినట్లు శుక్రవారం కేయూ దూర విద్యాకేంద్రం డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా.. దూరవిద్యా కేంద్రంలో పొందవచ్చని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో డిగ్రీ బీకాం జనరల్‌, కంప్యూటర్‌, బీబీఏ, బీఎస్సీ, పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈవిద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇదే చివరి గడువు అని, తమ ఫీజులను ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకుల ద్వారా డైరెక్టర్‌ ఎస్‌డీఎల్‌సీఈ కాకతీయ యూనివర్సిటీ పేరున కేయూ బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ (ఎస్‌బీఐ ఎన్‌ 0020262) వరంగల్‌కు తీసిన డీడీ ద్వారాగానీ దూర విద్యా కేంద్రంలోని ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్‌ నుంచి చలానా ద్వారా గానీ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలన్నారు. కోర్సుల వివరాలు ఇతర ఫీజుల వివరాలన్నీ సంబంధిత కేయూ ఎస్‌డీఎల్‌సీఈలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు (0870–2461480), (0870–2461490)లో సంప్రదించాలని పేర్కొన్నారు. దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఇప్పటికే ప్రవేశాలు పొందినవారు తమ దరఖాస్తు ఫారాల్ని వెంటనే దూరవిద్యా కేంద్రంలో అందించాలన్నారు. యూజీసీకి ప్రవేశాల వివరాల్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నందున అడ్మిషన్ల ఫారాలను దూర విద్యాకేంద్రంలో సమర్పించాలని సూచించారు.

చ‌ద‌వండి: Kakatiya University: కేయూ దూరవిద్య బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు

#Tags