PU Non-Teaching Staff: తాత్కాలిక నాన్‌టీచింగ్‌ సిబ్బందికి పరీక్ష కోసం సర్క్యులర్‌ జారీ..!

గతేడాది సిబ్బందికి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సర్క్యులర్‌ జారీ చేయగా వివాదం నెలకొనడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ అంశాన్ని మరోసారి అధికారులు తెరమీదకు తెచ్చారు.

మహబూబ్‌నగర్‌: పాలమూరు యూనివర్సిటీతోపాటు ఉమ్మడి జిల్లాలోని పీజీ సెంటర్లలో పనిచేస్తున్న తాత్కాలిక నాన్‌టీచింగ్‌ సిబ్బందికి పరీక్ష నిర్వహించేందుకు పీయూ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి మంగళవారం సర్క్యులర్‌ జారీ చేశారు. వచ్చే నెల 11లోగా సిబ్బంది తమ విద్యార్హత, అనుభవం, పనిచేస్తున్న కేటగిరి తదితర పూర్తి వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సిబ్బందికి ఏం స్కిల్స్‌ ఉన్నాయో వాటిని కూడా పరీక్షించనున్నట్లు తెలుస్తుంది.

Job Mela: గురువారం డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా

అయితే, గత కొన్నేళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్ష పెట్టడం వల్ల తమను తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే, పరీక్ష నిర్వహణకు సంబంధించిన సిలబస్‌ తదితర అంశాలు మరోసారి సర్క్యులర్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరీక్ష ఎలా రాయాలి.. ఏ సిలబస్‌ ఇస్తారో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

TS DSC Notification 2024: 11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌... పరీక్ష ఎప్పుడంటే

 

#Tags