Skip to main content

Job Mela: గురువారం డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా

నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
Skill Development Organization     Opportunity for Employment   Mega job mela opportunity for unemployed youth   Job Fair Announcement

చీపురుపల్లి: పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న గురువారం మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పీవీ కృష్ణాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఈ జాబ్‌ మేళాకు 14 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ జాబ్‌ మేళాకు టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ, డిప్లమో, ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు www.apssdc.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Candidates at TET Exam: ప్రశాంతంగా సాగిన టెట్‌ పరీక్ష.. తొలి రోజు హాజరైన వారి సంఖ్య ఇదే..!

ఈ నెల 29న ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని ఆ సమయానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 9010023033, 7286042743 నంబర్లను సంప్రదించాలని వివరించారు.

Published date : 28 Feb 2024 03:56PM

Photo Stories