Candidates at TET Exam: ప్రశాంతంగా సాగిన టెట్ పరీక్ష.. తొలి రోజు హాజరైన వారి సంఖ్య ఇదే..!
విశాఖ విద్య: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్–2024) మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు జిల్లాలోని ఏడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 4,420 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వీరిలో 3,837 మంది హాజరయ్యారు. దీంతో 86.80 శాతం మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు.
Corporate Education: పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత ప్రవేశాల అవకాశం..!
టెట్ పరీక్ష నిర్వహణపై విస్తృత ప్రచారం చేయటంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నారు. సిబ్బంది అభ్యర్థుల హాల్ టికెట్, తగిన ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తరువాతనే లోపలికి పంపించారు. పరీక్ష సజావుగా జరిగేలా అన్ని పరీక్షల కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల జిల్లా అబ్జర్వర్, ప్రత్యేక అధికారి బి.విజయ భాస్కర్ చినముషిడివాడ కేంద్రాన్ని పరిశీలించారు.
Skill Hub: స్కిల్ హబ్ పేరిట శిక్షణ, ఉపాధి అవకాశాలు..
పరీక్షల నిర్వహణ, కేంద్రంలో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ రెండు కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మరో రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. షెడ్యూల్ మేరకు మార్చి 6 వరకు పరీక్షలు జరుగుతాయి.