Dayalbagh Educational Institute: డీఈఐ అందిస్తున్న ప‌లు కోర్సులు ఇవే.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

ఆరిలోవ: విశాలాక్షినగర్‌ ప్రాంతం దయాల్‌నగర్‌లో దయాల్‌బాగ్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌(డీఈఐ)లో నిర్వహిస్తున్న పలు కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇనిస్టిట్యూట్‌ ఇన్‌చార్జి దక్షిణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో పలు కోర్సులు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. డ్రెస్‌ డిజైనింగ్‌–టైలరింగ్‌, కటింగ్‌–నూయింగ్‌, టెక్స్‌టైల్స్‌ డిజైనింగ్‌–ప్రింటింగ్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిజం, ఎలక్ట్రీషియన్‌ కోర్సులకు దరఖాస్తులు చేసుకోదలిచినవారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

Government Recognition: ప్ర‌భుత్వ నుంచి గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లోనే విద్యార్థుల ప్ర‌వేశం.. త‌ల్లిదండ్రుల‌కు ఇవే ముఖ్య సూచ‌న‌లు..!

ఆఫీస్‌ అసిస్టెంట్‌–కంప్యూటర్‌ ఆపరేటర్‌, మోడల్స్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌–సెక్రటేరియట్‌ ప్రాక్టీస్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల వారు www.dei.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని ఈనెల 26లోగా అందజేయాలన్నారు. వివరాలకు 9963340611 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Singareni Jobs 2024 : సింగరేణి ఉద్యోగుల‌కు శుభవార్త..

#Tags