Government Recognition: ప్రభుత్వ నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే విద్యార్థుల ప్రవేశం.. తల్లిదండ్రులకు ఇవే ముఖ్య సూచనలు..!
విజయనగరం:
గుర్తింపు పొందిన స్కూల్స్ 431
జిల్లాలోని 27 మండలాల పరిధిలో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 431 ఉన్నాయి. వాటిలో సీబీఎస్‌సీ, స్టేట్ సిలబస్ ఉన్న ప్రాథమిక పాఠశాలు 127, ప్రాథమికోన్నత పాఠశాలలు 149, ఉన్నత పాఠశాలలు 155 ఉన్నాయి. దాదాపు 90 వేల మంది విద్యార్థులు అన్ని తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలేవీ లేవు.
AP Model School Admissions: ఏపీ మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ!
విద్యాసంస్థపై ఆరా తీయాల్సిన అంశాలు
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. గుర్తింపు పొందిన విద్యాసంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటాయి. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రైవేట్ విద్యార్థిగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అవసరం.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చాలనుకునే తల్లిదండ్రులు ఆకర్షణీమైన ప్రకటనలు చూసి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుసుకోవాలసిన ప్రధానమైన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
●చేరాల్సిన పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా? లేదా? అనేది తొలుత చూసుకోవాలి. పాఠశాల భవనం నాణ్యతపై ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.
●జి–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్తి స్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి.
Private Schools Admissions: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు కడితేనే అడ్మిషన్..! లేకుంటే..
●బాత్ రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా చూసుకోవాలి.
●ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాల అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.
●విద్యార్థుల మానసిక, శారీరకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి.
●అన్ని సబ్జెక్టులకు అర్హత గల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారా లేదా అన్న విషయం పరిశీలించాలి.