Skip to main content

NEET UG 2024: నీట్‌ పరీక్షను రద్దు చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షలో పలు చోట్ల కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ డిమాండ్‌ చేశారు.
NEET exam should be cancelled

జూన్ 10న‌ ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ నీట్‌ పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలమైందని, లీకేజీలో బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.

చదవండి: NEET 2024: నీట్ 2024 ప‌రీక్షపై విచార‌ణ జ‌ర‌పాల్సిందే.. లేకుంటే..!

ఒకే సెంటర్‌లో 8 మందికిపైగా విద్యార్థులకు 720, 719, 719 మార్కులు రావడం అనుమానాలకు దారి తీసిందని, ఒక ప్లాన్‌ ప్రకారంగానే ఇదంతా జరిగిందని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు విచారణకు ఎందుకు కోరడం లేదని దయాకర్‌ నిలదీశారు.   
 

Published date : 11 Jun 2024 03:22PM

Photo Stories