NEET 2024: నీట్ 2024 పరీక్షపై విచారణ జరపాల్సిందే.. లేకుంటే..!
కంబాలచెరువు: వైద్య, విద్యా కోర్సులు చదవాలనుకునే 24 లక్షల మంది విద్యార్థులకు గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్ సోమవారం తెలిపారు. గతంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు వచ్చాయన్నారు. ఇప్పుడు మార్కుల్లో అవకతవకలు, విడుదల చేసిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడం, ఎనిమిది మందికి ఒకే కేంద్రం కావడం వంటి పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయన్నారు.
TGSWREIS: గురుకులాల్లో సాధారణ బదిలీలు నిర్వహించాలి
ఎన్నికల ఫలితాల హడావుడిలో ఎవరూ పట్టించుకోరు అనే ధోరణిలో నీట్ పరీక్ష నిర్వహణ జరిగిన అక్రమాలను కప్పిపెట్టే ఉద్దేశంతో ఎన్‌టీఏ ఇలా చేసిందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వంటివన్నీ లీకేజీ, ప్యాకేజీలకే పరిమితమవుతున్నాయన్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపి మరోసారి నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.
Tags
- neet 2024
- medical exam
- admissions
- Entrance Exam
- Investigation on NEET 2024
- Re exam of NEET 2024
- PDSU State Joint Secretary S.Kirankumar
- medical college entrance exam
- AP NEET 2024
- Education News
- Sakshi Education News
- East Godavari District News
- NEET
- Medical Colleges
- allegations
- admissions
- Education
- SakshiEducationUpdates