Jagananna Videshi Vidya Deevena: ప్రతిభ ఉంటే విదేశీ విద్య.. నేడు విదేశీ విద్యా దీవెన నగదు జమ

అనంతపురం రూరల్‌: పేదరికం వల్ల ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతిభ ఉండి ఉన్నత విద్య చదవాలనుకున్న వారి కలను ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ ద్వారా సాకారం చేస్తున్నారు. ఈ పథకం కింద టాప్‌ 100 ర్యాంకులు కలిగిన విదేశీ యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఈబీసీ విద్యార్థులకై తే రూ.కోటి దాకా వర్తింపజేస్తుంది. టాప్‌ 100 నుంచి 200లోపు ర్యాంక్‌ కలిగిన యూనివర్సిటీల్లో సీటు వస్తే రూ. 80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఫీజులు భరిస్తుంది. ఈ పథకం కింద అనంతపురం జిల్లాలో ఎంపికై న నలుగురు విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు బుధవారం రూ.54.40 లక్షల సొమ్ము జమ కానుంది.

చ‌ద‌వండి: Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు తలరాత.. ఏపీలో విదేశీ విద్యా దీవెన.. దాదాపు కొన్ని వంద‌ల‌ కోట్లు జ‌మ‌..!

#Tags