Skip to main content

PG Medical Seats Notification: పీజీ మెడిక‌ల్ సీట్ల‌కు వెబ్‌ఆప్షన్ల నోటిఫికేష‌న్

ఇటీవలే పీజీ మెడిక‌ల్ సీట్ల‌కు కౌన్సిలిలంగ్ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీకి మ‌ళ్ళీ వెబ్‌ఆప్షన్ల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసారు. ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ఈ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. వెబ్‌ఆప్షన్, కౌన్సిలిలంగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలు...
notifications about web options for pg medical seats
notifications about web options for pg medical seats

సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్‌ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది.

PM SHRI: పీఎంశ్రీకి 44 పాఠశాలలు ఎంపిక.. పాఠశాలలు ఇవే..

అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్‌ఎల్, మహా­రాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించింది.

Schools for Tribals and Villages: గిరిజ‌న ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల నిర్మాణం

ఆ తర్వాత రాజమండ్రి జీఎస్‌ఎల్‌ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్‌ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్‌ ఫేజ్‌–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.  
 

Published date : 08 Sep 2023 02:49PM

Photo Stories