PM SHRI: పీఎంశ్రీకి 44 పాఠశాలలు ఎంపిక.. పాఠశాలలు ఇవే..
ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలం నుంచి రెండేసి పాఠశాలలను ఎంపిక చేసి ఐదేళ్ల వ్యవధిలో రూ.2కోట్లు మేర నిధులు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. మొదటి దఫాలో 19పాఠశాలలు జాతీయ స్థాయిలో ఎంపికయ్యాయి.
రెండో దఫా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా జిల్లా నుంచి 44 పాఠశాలలు అర్హత సాధించాయి. కలెక్టర్ ఆమోదం తర్వాత సెప్టెంబర్ 6న రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడ పరిశీలన తర్వాత జాతీయ స్థాయికి పంపిస్తారు.
చదవండి: PM-Shri Scheme: పాఠశాలలకు వరం
కార్యక్రమాలు ఇలా..
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక వనరుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి. పాఠశాలల్లో సౌర వి ద్యుత్, ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు, తోటల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత చర్యలు, బొమ్మలతో బోధన, విద్యార్థుల సామర్థ్యాల మదింపు వంటివన్నీ చేపడుతారు.
ఉ పాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల్లో భాషా పరమైన అవరోధాలు అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
చదవండి: పీఎంశ్రీకి టేకులోడు గురుకుల పాఠశాల ఎంపిక
పాఠశాలలు ఇవీ..
జెడ్పీహెచ్‌ఎస్(బాలికల) బెల్లంపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ బజార్‌ఏరియా, కేజీబీవీ బెల్లంపల్లి, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల(టీఎం, ఈఎం) చెన్నూర్, వెల్గనూర్, స బ్బపల్లి, కలమడుగు, ధర్మారావుపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లు, కాసిపేట, లింగపూర్, పడ్తన్‌పల్లి, మిట్టపల్లి, వేలాల, ఇందన్‌పల్లి, తిమ్మాపూర్, నార్వయిపేట్ ఎంపీయూపీఎస్‌లు, చింతగూడ, గీతానగర్, జన్కపూర్, కుందారం, దేవాపూర్, దేవులవాడ, అల్గాన్, లక్ష్మీపూర్, బస్టాండ్ లక్సెట్టిపేట, బోయవాడ లక్సెట్టిపేట, బాలుర లక్సెట్టిపేట, మైలారం, గొల్లపల్లి, నెన్నెల, దొరగారిపల్లి, గూడెం, మామిడిపల్లి, పెద్దపేట్, రెబ్బనపల్లి ఎంపీపీఎస్‌లు, టీఎస్‌ఎంఎస్ కో టపల్లి, జెడ్పీహెచ్‌ఎస్(బాలికల) లక్సెట్టిపేట, జీపీఎస్ ఏసీసీ, జీపీఎస్ హమాలీవాడ, జీ యూపీఎస్(యూఎం) మోమిన్‌పూర, యూపీఎస్, ఎంపీయూపీఎస్ 2జోన్ మందమర్రి, ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆ ర్‌ఈఐఎస్ బాలుర నస్పూర్, ఎంపీపీఎస్ సంఘమల్లయ్యపల్లె ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి నివేదించారు.