Ed. CET 2024 Notification: బీఈడీ కోర్సులో ప్రవేశానికి టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష తప్పనిసరి.. అందుకు అర్హులు వీరే..!
సాక్షి ఎడ్యుకేషన్: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఈ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్ 2024కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ తదితర వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
May Month Exam Calendar: ఓవైపు పోటీపరీక్షలు, మరోవైపు ప్రవేశపరీక్షలు.. మే నెలంతా పరీక్షల కాలమే
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
వయసు
జూలై1, 2024 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
వీరికి అర్హతలేదు
ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్‌సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ వంటి జాబ్ ఓరియెంటెడ్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు.
Chang’e-6: చంద్రుడిపైకి చాంగే-6 లూనార్ ప్రోబ్‌ను ప్రయోగించనున్న చైనా..
పరీక్ష విధానం ఇలా
ఎడ్‌సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60 మార్కులకు(మ్యాథమెటిక్స్–20 మార్కులు, సైన్స్–20 మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
కనీస మార్కులు
ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25 శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.
New PG Course: ‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభం
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 06.05.2024.
- ఆలస్య రుసుముతో 13.05.2024 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 20.05.2024
- టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష తేదీ: 23.05.2024
- వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in
ప్రిపరేషన్ ఇలా..
ఫిజికల్, బయోలాజికల్ సైన్స్
ఆహారం, జీవులు, జీవన ప్రక్రియలు, జీవ వైవి«ధ్యం, కాలుష్యం, పదార్థం,కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, వేడి, ధ్వని, కదలిక, మార్పులు, వాతావరణం, బొగ్గు అండ్ పెట్రోల్, సహజ సిద్ధమైన దృగ్విషయం, నక్షత్రాలు, సౌరవ్యవస్థ, లోహశాస్త్రం, రసాయన ప్రతిచర్యల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. వీటికి సమాధానాలు గుర్తించేందుకు స్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవాలి.
సాంఘిక శాస్త్రం
భౌగోళిక శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. నిర్దిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
Tenth & Inter Results: ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ఖైదీల ప్రతిభ
మ్యాథమెటిక్స్ సిలబస్
సంఖ్యావ్యవస్థ, వాణిజ్య గణితం, బీజ గణితం, జ్యామితి, కొలతలు, త్రికోణమితి, సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం పదోతరగతి వరకూ గణితం పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలను వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి.
టీచింగ్ ఆప్టిట్యూడ్
ఆప్టిట్యూడ్‌కు సంబంధించి బోధన అభ్యసన ప్రక్రియ, తరగతి గదిలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
జనరల్ ఇంగ్లిష్
రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్‌మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనికోసం హైస్కూల్ స్థాయి ఏదైనా ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని చదవాలి. పాత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్
కరెంట్ అఫైర్స్‌లో ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, తాజా ప్రాంతీయ పరిణామాలు, అవార్డులు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను నోట్స్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుండాలి.
CBSE 10th and 12th Results 2024 Updates: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
కంప్యూటర్ అవేర్‌నెస్
కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్ వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
Tags
- TS Ed CET
- Entrance Exams
- Teacher jobs
- b Ed courses
- eligibles for b Ed courses
- preparation method for ed cet exam
- online applications
- age limit for b Ed course
- teacher job for graduates
- teacher eligibility exams
- Education News
- Sakshi Education News
- mahatma gandhi university
- Examination Procedure
- Exam preparation
- notifications
- Entrance Exam
- TS Edset 2024
- sakshieducation updates