Skip to main content

Tenth & Inter Results: ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌లో ఖైదీల ప్రతిభ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇటీవల విడుదలైన ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీలు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు.
Talent of prisoners in open tent and inter   Academic achievements

అత్యధిక మార్కులు సాధింన ఖైదీలు సురేష్‌ కుమార్, మాణిక్యంతో పాటు ఇతర ఖైదీలను ఆయన మే 2న‌ సత్కరించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ, సెంట్రల్‌ జైలు నుం తొలిసారి 48 మంది ఖైదీలు ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలకు హాజరవగా, వారిలో 39 మంది పాసై, 81 శాతం ఉత్తీరత సాధించారని తెలిపారు.

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

అలాగే ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు 12 మంది రాయగా, 11 మంది పాసై 92 శాతం ఉత్తీరత సాధించారని చెప్పారు. రెండు విభాగాల్లో 90 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడం విశేషమన్నారు. గత ఏడాది డిగ్రీ పరీక్షల్లో సెంట్రల్‌ జైలు ఖైదీ ఒకరు రెండు బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయిలో పేరు తీసుకుని వచ్చారన్నారు.

జైలులో ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎం.రాజ్‌కుమార్‌ను, వారు చదువులను ప్రోత్సహిస్తున్న జైలర్‌ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు, ఎంఏ శర్మ, వార్డర్‌ శంకరరావులను రాహుల్‌ అభినందించారు. కార్యక్రమంలో జైలు సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, జైలర్లు సీహెచ్‌ రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Published date : 03 May 2024 05:10PM

Photo Stories