May Month Exam Calendar: ఓవైపు పోటీపరీక్షలు, మరోవైపు ప్రవేశపరీక్షలు.. మే నెలంతా పరీక్షల కాలమే
దేశ వ్యాప్తంగా మే నెలంతా పలు పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో పలు ప్రవేశపరీక్షలు, పోటీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, అభ్యర్థులు వివిధ రకాల పోటీ పరీక్షలతో కుస్తీపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు విడుదల చేసిన ఉద్యోగ, ప్రవేశ పరీక్షల ప్రకటనలకు సంబంధించిన పరీక్షలు కూడా మే నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలో మే నెలలో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్‌ను ఓసారి చూసేద్దాం.
మే నెలలో జరగనున్న పలు పరీక్షల తేదీల వివరాలు
ఏపీ ఐసెట్‌పరీక్ష మే 6న జరగనుండగా, ఈసెట్ పరీక్ష మే 8న నిర్వహించనున్నారు. ఇక ఏపీ ఎంసెట్ పరీక్షలు అగ్రికల్చర్, ఫార్మసీ సెక్టార్లకు సంబంధించిన పరీక్షలు మే 16-17 వరకు జరగనుండగా, ఇంజనీరింగ్ స్ట్రీమింగ్‌కు సంబంధించి మే 18-23 వరకు జరగనున్నాయి.
ఇక టీఎస్ ఈసెట్ పరీక్ష మే 6న జరగనుండగా, ఎంసెట్, ఎడ్‌సెట్ పరీక్షలు కూడా మే నెలలోనే నిర్వహించనున్నారు. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, జూనియర్ ఇంజనీర్ మెయిన్స్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్షలు కూడా మే నెలలోనే జరగనున్నాయి. ఇలా వివిధ పోటీ పరీక్షలతో మే నెల షెడ్యూల్ అభ్యర్థులకు బిజీబిజీగా మారింది.