Skip to main content

Degree Admissions: డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం

AP Degree Admission 2024 Registration Started

ఎచ్చెర్ల క్యాంపస్‌: డిగ్రీ ప్రవేశాలకు వేళయ్యింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకులం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 10 నియోజక వర్గాల్లో 102 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 25,000 వరకు సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది డిగ్రీ ఆరో సెమిస్టర్‌ (చివరి సెమిస్టర్‌) 9832 మంది రిలీవ్‌ అయ్యారు. మొదటి ఏడాది మాత్రం 8299 మంది ప్రవేశాలు పొందారు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలపై ప్రైవేట్‌ కళాశాలలు ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం మెరుగ్గా ప్రవేశాలు జరుగుతున్నాయి.

డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియె ట్‌ మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌, ప్రత్యేక కేటగిరీ వంటి అంశాల ఆధారంగా సీట్లు లభిస్తాయి. ఒకటో తేదీన నోటిఫికేషన్‌ విడుదల కాగా, 10వ తేదీలోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. 
11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్లు ఇ చ్చుకోవాల్సి ఉంటుంది. 19 తేదీన సీట్లు అలాట్‌మెంట్‌ చేస్తారు. 20 నుంచి 22వ తేదీ మధ్య విద్యార్థులు సీటు వచ్చిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఎన్‌సీసీ, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌, ఇతర ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ఏర్పాటు చేసి సహాయ కేంద్రాల్లో 4నుంచి 6వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.

Degree Admissions2024 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

బీఆర్‌ఏయూ పరిధిలో ఆర్ట్సు, సైన్స్‌, కామర్స్‌, మేనేజ్‌ మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ వంటి కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ గ్రూప్‌ ఆధారంగా ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. మరో పక్క కొన్ని కోర్సులకు జాతీయ సాంకేతిక విద్యా మండలి (ఎన్‌సీటీ ఈ) గుర్తింపు తప్పని సరి చేశారు. బీసీఏ, సీబీఏ, బీఎంఎస్‌ వంటి కోర్సుల నిర్వహణకు ఎన్‌సీటీఈ గుర్తింపు తప్పని సరి, ఈ కోర్సులు కొన్ని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్నారు.

87 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం వర్సిటీ అఫిలియేషన్‌ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు జూన్‌ నెలలలో 17 ద్విసభ్య అఫిలియేషన్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలు, కళాశాలలు పరిశీలించి ఉన్నత విద్యా మండలికి రిపోర్టులు అందజేశారు. కొన్ని కళాశాలలకు శాశ్వత, మరికొన్ని కళాశాలలకు షరతులతో కూడిన గుర్తింపు మంజూరు చేశారు.

జిల్లాలో కొన్ని డిగ్రీ కళాశాలల్లో కనీసం 30 శాతం ప్రవేశాలు జరగటం లేదు. కనీసం కళాశాల నిర్వహించాలంటే 50 శాతం ప్రవేశాలు జరగాలి. కళాశాలల్లో ప్రవేశాల్లో చేరే విద్యార్థులు కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించి చేరటం మంచిది. గత కొన్నేళ్ల నుంచి ప్రవేశాలు, ఫలితాలు, ప్లేస్‌ మెంట్‌లు, ఇతర నైపుణ్య శిక్షణలు పరిగణనలోకి తీసుకుని చేరితే మంచి భవిష్యత్‌ ఉంటుంది.

Indian's in America : అమెరికాలో పెరిగిన భార‌తీయ‌ విద్యార్థుల సంఖ్య‌.. ఐటీ, ఫైనాన్స్ సెక్టార్ల‌పైనే ఆస‌క్తి!

నోటిఫికేషన్‌ మేరకు ప్రవేశాలు
ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ మేరకు ప్రవేశా లు నిర్వహిస్తారు.విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాప్యంలేకుండా అఫిలి యేషన్‌ బృందాలు పరిశీలన పూర్తిచేసి, నివేదిక ఉన్నత విద్యా మండలికి అందజేస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. – పి.సుజాత, రిజిస్ట్రార్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం

Published date : 04 Jul 2024 10:05AM

Photo Stories