Degree admissions 2024 : నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్‌వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.
ఈ మేరకు జూలై 2వ (నేడు) నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 5న కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 15 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించింది. 19న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20 నుంచి 22లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు (దివ్యాంగులు, ఎన్‌సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) సర్టిఫికెట్లను 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనుంది.
ఈ విద్యార్థులు విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్, విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాలి. ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ (https://cets.apsche.ap.gov.in/APSCHE/OAMDC24/OAMDCHome.html) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.
Tags
- Admissions Notification
- Degree Admissions Notification 2024
- Admission 2024
- Degree students admissions 2024
- Sakshi Education News
- amaravathieducation
- degreeadmissions in 2024
- HigherEducationCouncil
- OnlineAdmissions
- GovernmentColleges
- AutonomousColleges
- PrivateColleges
- AcademicYear2024
- latest admissions in 2024
- sakshieducationlatestadmissions