Skip to main content

Music college: సంగీత కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం.. అర్హులు వీరే..

సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Vizianagaram Town Music and Dance College Admission Notice   July 1 Admission Announcement for Music and Dance College   Invitation to Admission at Music college in Andhra Pradesh  Admission Announcement for Music and Dance College

విజయనగరం టౌన్‌: మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కేఏవీవీఎల్‌ఎన్‌.శాస్త్రి జులై 1వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సంవ‌త్స‌రాల సర్టిఫికెట్‌ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులో శిక్షణకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డిప్లమో కోర్సులో చేరేందుకు అర్హులని సూచించారు. 

విద్యార్థులు గాత్రం, వీణ, వయోలిన్‌, నాదస్వరం, మృదంగం, డోలు, భరతనాట్యంలో శిక్షణ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పదేళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులని, ఆసక్తి గల విద్యార్థులు 08922–223751 నంబర్‌ను కానీ నేరుగా కళాశాలలో గానీ సంప్రదించాలని కోరారు.

Certificate Verification : ఈ-సెట్‌లో విద్యార్థుల స‌ర్టిఫికెట్ ప‌రిశీలన ప్రారంభం..

Published date : 04 Jul 2024 08:56AM

Photo Stories