New Academic Year : ఈ విద్యా సంవత్సరంలో ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి..
కర్నూలు: మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, సమగ్రశిక్ష అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 62 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు, ఎంఈఓలు ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. గతేడాది ఫలితాల్లో రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉత్తీర్ణత బాగుందని, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో విశ్లేషించుకోవాలని సూచించారు.
ప్రతి విద్యార్థి పాస్ కావాలన్న లక్ష్యంతో మండలం, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు అవకాశం ఉందన్నారు. పోస్టుల భర్తీ అయ్యే వరకు వర్కు అడ్జెస్ట్‌మెంట్‌లో ఉపాధ్యాయులను నియమించడం, ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవడం, వర్చువల్‌గా బోధన చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ శామ్యూల్‌ను ఆదేశించారు. మెగా డీఎస్సీలో కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేయనున్నామని, డీఎస్సీ నిర్వహణ అంశంలో ఒక్క ఫిర్యాదు లేకుండా సాఫీగా నిర్వహిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
Education Funds : బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలందరికీ తల్లి వందనం ఇవ్వాల్సిందే..!
విద్యార్థులు మధ్యలో బడి మానేయడంపై దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం అర్జీలు వస్తున్నాయని, అన్ని పాఠశాలల అధికారులు సమావేశమై వారికి అడ్మిషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థి కిట్లను వారంలోపు పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం పేద విద్యార్థులకు ఇచ్చే సీట్లలో 979 మంది ఇంకా చేరలేదని, వారు చేరకపోతే ఆ సీట్లలో ఇతరులను చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్, ఏడీ పాల్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Education Funds : బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలందరికీ తల్లి వందనం ఇవ్వాల్సిందే..!