ITI Second Phase Counselling : ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్.. ఈ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేయాలి
మొగల్రాజపురం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకరావు ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లను ఈ రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నెల 24వ తేదీలోగా iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకున్న కళాశాలకు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి ప్రిన్సిపాల్‌తో పరిశీలన చేయించుకోవాలని వివరించారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల 27, 28 తేదీలు, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే వారికి ఈ నెల 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని కనకరావు వివరించారు. ఇతర వివరాలకు 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
DSC Free Coaching : బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిందే..
Tags
- iti admissions
- Tenth Students
- second phase counselling
- govt and private iti colleges
- Principal Kanakarao
- july 24
- registrations for counselling
- certificates verifications
- first phase counselling seats in iti colleges
- Education News
- Sakshi Education News
- Mogalrajapuram
- Principal of Government ITI College
- second round of admissions process