Sandhya Devanathan: ఆంధ్రా నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వరకు.. ఎన్నో విజయాలు!

అదే ఆమె నైపుణ్యం. నాయకత్వ బలం.
46 ఏళ్ల సంధ్య దేవనాథన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో చదివారు. 1994లో ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. అనంతరం 2014లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ‘లీడర్‌షిప్’ కోర్స్ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వరకు ఎన్నో ప్రసిద్ధ విద్యాలయాల్లో చదువుకున్న సంధ్య నిత్య విద్యార్థి. అదే ఆమె నైపుణ్యం. నాయకత్వ బలం.
సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన తరువాత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో చేరి మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ప్రొడక్ట్స్) స్థాయికి ఎదిగారు. 2016 జనవరిలో ఫేస్‌బుక్‌లో చేరిన సంధ్య దేవనాథన్ నాలుగేళ్లకు పైగా అక్కడే పనిచేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో మెటా మేనేజింగ్ డైరెక్టర్(సింగపూర్), మెటా బిజినెస్ హెడ్ (వియత్నాం)గా పనిచేశారు. మెటాకు సంబంధించి ఆగ్నేయాసియా ఇ–కామర్స్ వ్యవహారాలను పర్యవేక్షించారు. మెటా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకటన వచ్చే వరకు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గేమింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Ramya Ramachandran: ఆలోచన.. ఆచరణ.. ఆదాయం
మెటా ప్రకటనకు ముందు వరకు ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గేమింగ్–వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం సాధారణ విషయం ఏమీ కాదు.
ఇంతకీ సంధ్య బలం ఏమిటి?
వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే నైపుణ్యం, సమర్థవంతులైన ఉద్యోగులతో బృందాన్ని ఏర్పాటు చేసుకొని అత్యున్నత ఫలితాలు రాబట్టడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ‘ఇది నా బలం’ అని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. మీడియాలో పెద్దగా ఇంటర్య్వూలు కూడా కనిపించవు. అయితే ఆమె ట్రాక్ రికార్డే ఆమె బలం ఏమిటో చెబుతోంది.
పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, నేషనల్ లైబ్రరీ బోర్డ్(సింగపూర్), సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, మినిస్టర్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్స్(సింగపూర్), ఉమెన్స్ ఫోరమ్ ఫర్ ది ఎకా నమీ అండ్ సొసైటీ.. మొదలైన వాటిలో బోర్డ్ మెంబర్‌గా పనిచేసిన సంధ్యకు స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఆసక్తి.
మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మెటా ఉమెన్స్, ఏపీఏసీలో ఎగ్జిక్యూటివ్ స్పాన్సరర్‌గా విధులు నిర్వహించింది.

డిటిటల్ రంగంపై మన ఆసక్తిని గమనించిన మెటా తన టాప్ ప్రాడక్ట్స్‌ను ఇండియాలోనే లాంచ్ చేసింది. మన దేశంలోని లీడింగ్ బ్రాండ్స్, క్రియేటర్స్, అడ్వర్‌టైజర్‌లతో కంపెనీకి ఉండే స్ట్రాటిజిక్ రిలేషన్‌ను బలోపేతం చేయడానికి బలమైన వ్యక్తి కోసం వెదికింది మెటా.
తమ భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చే శక్తి సామర్థ్యాలు సంధ్యలో ఉన్నాయనే బలమైన నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించింది.
ఈమె పేరే ఒక సంచలనం.. ఇదే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని..
ఆమె నేర్చుకున్న పాఠాలే దారి చూపాయి..
‘లీడర్‌షిప్, లెర్నింగ్ అనేవి వేరు వేరు ధ్రువాలు కాదు. ఒకదానిపై ఒకటి అనివార్యంగా ఆధారపడతాయి’. సిటీబ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసినా, మెటా లాంటి సంస్థలో బాస్‌గా కీలక విధులు నిర్వహించినా నేర్చుకోవడాన్ని మాత్రం సంధ్య ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తులు మొదలు సామాజిక పరిస్థితుల వరకు ఎన్నో విషయాలు నేర్చుకొని తనను తాను తీర్చిదిద్దుకుంది. ప్రసిద్ధ విద్యాలయాల్లో ఆమె నేర్చుకున్న పాఠాలు ఎన్నో సందర్భాలలో తనకు దారి చూపాయి.