Skip to main content

Sri Venkateswara Medical College: పారామెడికల్‌ కోర్సులకు 30న ఇంటర్వ్యూలు

First-year fee: Rs.8,150,Interviews for paramedical courses on 30th August, SV Medical College admissions

తిరుపతి తుడా: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో పారామెడికల్‌ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 30న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరానికి పై కోర్సులకు సంబంధించి ప్రవేశాలకు ప్రభుత్వం ఇచ్చిందని, ఇప్పటికే అలైడ్‌ హెల్త్‌ సైన్స్‌, పారా మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రిన్సిపల్‌ చాంబర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. అడ్మిషన్లు పొందే అర్హులు మొత్తం మొదటి ఏడాది ఫీజు రూ.8,150 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 

Published date : 11 Sep 2023 09:48AM

Photo Stories