Skip to main content

Tomorrow job Mela: మెగా జాబ్‌మేళా

Mega Job Mela Announcement  VKR College Campus  Mega job Mela  Venkat Motaparthi, President of the Management Committee of VKR College
Mega job Mela

గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు వీకేఆర్‌ కళాశాలలో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు వెంకట్‌ మోటపర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్‌మేళాలో సుంగ్‌వూ హైటెక్‌, హ్యుందాయ్‌, మోబిస్‌, యాక్ట్‌, ఆల్‌స్టోమ్‌, డైకిన్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, డిక్‌, డిక్సన్‌, ఫాక్స్‌కాన్‌, హెడీబీ ఫైనాన్షియల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నీట్‌, ఇన్‌పిలూమ్‌ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.

AP Education Department news: విద్యాశాఖకు కీలక ఆదేశాలు...అలాగే వీరికి ఉచితంగా...


పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ పూర్తిచేసిన 18 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు, మహిళలు ఈ జాబ్‌మేళాకు అర్హులుగా తెలిపారు.

ఈ జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని పరిసరా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Published date : 19 Jun 2024 08:33AM

Photo Stories