AP Paramedical posts: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పారామెడికల్ పోస్టులు
Sakshi Education
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఖాళీగా ఉన్న 52 పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వీ పాల్ రవికుమార్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు గ్రేడ్–2 ఫార్మసీ, ఏడు థియేటర్ అసిస్టెంట్, రెండు ల్యాబ్ అటెండెంట్, మూడు పోస్టుమార్టమ్ అసిస్టెంట్, రెండు మెడికల్ రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఐదు ప్లంబర్, రేడియోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, డెంటల్ టెక్నీషియన్, 26 ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తులను డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. https://ana nthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
APPSC Group-1.. తొలి ప్రయత్నంలోనే కొట్టానిలా..| APPSC Group 1 Ranker Pavani Success Story | DSP Job
Published date : 07 Sep 2023 06:46PM