IIIT: ట్రిపుల్ ఐటీలో న్యాక్ బృందం పర్యటన.. ఎక్కడంటే
హర్యానా సోన్ పాట్ దీనబంధు చోటు రామ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజేంద్రకుమార్, చైర్ పర్సన్ అనాయత్‌ల ఆధ్వర్యంలో 8మంది న్యాక్ బృందం ఆర్‌కేవ్యాలీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అన్నమయ్య జిల్లా వేంపల్లె మండలంలో మూడు రోజుల పాటు ఆర్‌కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో అన్ని విభాగాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, ప్రయోగశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానం, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు, లైబ్రరీ, ఒకేషనల్ విభాగాలు తదితర వాటిని సందర్శించనున్నారు.
డిసెంబర్ 28(గురువారం) సివిల్ విభాగానికి సంబంధించి ల్యాబ్‌లను పరిశీలించి అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులతో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్‌లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ, వివిధ విభాగాల కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 29న కూడా వివిధ విభాగాలలో పరిశీలించి ఉన్నతాధికారులకు న్యాక్ బృందం నివేదికలు పంపనున్నారని తెలిపారు.