AC Team Visit Degree College: కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం
Sakshi Education
ఉట్నూర్ రూరల్: మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో గల తెలంగాణ గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను సెప్టెంబర్ 12న ఎన్‌ఏఏసీ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పీర్ టీమ్ సభ్యులు ఉమారాణి, శివరాం ప్రసాద్, ఆగస్టిన్ సందర్శించారు.
కళాశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల బోధన విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీ, ల్యాబ్, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు.
చదవండి: First Women's College: నాక్ ఏ–ప్లస్ గ్రేడ్ పొందిన తొలి మహిళా కళాశాల ఇదే!
భోజన, వసతి సౌకర్యాలపై విద్యార్థులు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిత, అధ్యాపకులు పాల్గొన్నారు.
Published date : 13 Sep 2024 03:11PM
Tags
- Telangana Gurukula Tribal Welfare Residential Girls Degree College
- NAAC
- National Assessment and Accreditation Council
- Umarani
- Sivaram Prasad
- Augustine
- College Education Standards
- infrastructure
- Faculty Teaching
- library
- Lab
- Classrooms
- Principal Haritha
- NAAC Team Visit Degree College
- Adilabad District News
- Telangana News