Ankura Training: ‘అంకుర’ శిక్షణకు దరఖాస్తులు
Sakshi Education
తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని అగ్రి ఇంక్యుబేటర్ సంస్థ ఆధ్వర్యంలో అంకుర సంస్థల ఏర్పాటుకు ఆసక్తిగల వారికి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ శారదా జయలక్ష్మి తెలిపారు.
![Opportunity to set up seed companies with VC Sharada Jayalakshmi's support Applications For Ankura Companies Training Tirupati Regional Agricultural Research Station offers seed company training](/sites/default/files/images/2023/12/29/ankura-training-1703827862.jpg)
డిసెంబర్ 27(బుధవారం) ఈ మేరకు కళాశాల ఆవరణలో ప్రకటన విడుదల చేశారు. ఆర్‌కేవీవై పథకం ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతుల సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను చేయగల ఔత్సాహికులు విద్యార్హతతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
2019 నుంచి ఇప్పటి వరకు 6 బ్యాచ్‌లకు విజయవంతంగా శిక్షణ ఇవ్వడంతోపాటు, అంకుర సంస్థల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించామని వివరించారు. నూతన బ్యాచ్‌లో ఔత్సాహికులకు రెండు విభాగాల కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 94416 70829 నంబరులో సంప్రదించవచ్చని వెల్లడించారు.
AP Endowments Department Jobs: ఏపీ దేవదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Published date : 29 Dec 2023 11:01AM