Skip to main content

TS News: నేడే మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలకు భూమిపూజ

కరీంనగర్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. మొగ్ధుంపూర్ గ్రామ శివారులోని పూరేన్‌ గుట్టకు సంబంధించిన 43.16 ఎకరాల భూమిని కలెక్టర్‌ కర్ణన్‌ కేటాయించారు. మొదటి దశలో చుట్టూ రెండున్నర కిలోమీటర్ల ప్రహరీ నిర్మాణం, ఏడెకరాల్లో గుట్టను చదును చేసేందుకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.1.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను మంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Telanagana government
Telanagana government

రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో ఉపాధి, ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకొని, మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సులతో ఇటీవల 15 కాలేజీలను ప్రకటించింది. మొదటిది వనపర్తి జిల్లాలో ప్రారంభించారు. రెండోది కరీంనగర్‌ జిల్లాకు మంజూరవగా భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మొగ్ధుంపూర్‌లోని పూరేన్‌ గుట్ట వద్ద అధికారులు గుర్తించారు. కళాశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

చ‌ద‌వండి: ఏపీలోనే ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌... దేశంలోనే నాలుగో స్థానం

చ‌ద‌వండి: భార‌త రాజ‌కీయాల్లో తండ్రీకూతుళ్ల‌దే ఇప్ప‌టికీ రికార్డు...

Published date : 31 Mar 2023 01:40PM

Photo Stories