AP News: ఏపీలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ... దేశంలోనే నాలుగో స్థానం
- అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో.. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో.. 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: APPSC: గ్రూప్–1 మెయిన్స్ తేదీలు ఇవే..
- ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.
- ఇంగ్లిష్, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 22–25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం
ఉంది.
చదవండి: ఒక్కో పాఠశాలకు 46 లక్షలు.. దేశవ్యాప్తంగా 9 వేల పాఠశాలలకు మహర్దశ
- మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగనున్నాయి.
- ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మికులకు వనరులు అందుబాటులో ఉన్నాయి.
- న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి,
- ఇంగ్లిష్‌తోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి.