Vidyadhan Scholarship 2023: పేద విద్యార్థులకు 60 వేల వరకు స్కాలర్‌షిప్... ఇలా అప్లై చేసుకోండి
ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. వీరి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. అలాంటి విద్యార్థులకు ‘విద్యాదాన్’ ఉపకార వేతనాలు అందించనున్నారు.
Record Breaking Salary: అత్యధిక వేతనంతో అదరగొట్టిన షాప్ కీపర్ కొడుకు... కోట్ల ప్యాకేజీలతో ఆదర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు
విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ భావన. ఈ లక్ష్యంతోనే ఫౌండేషన్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నారు. దివ్యాంగులైతే పదో తరగతిలో 75 శాతం లేదా 7.5 సీజీపీఏ మార్కులు సాధించిన వారు అర్హులు.
ఫౌండేషన్ ఎంపికచేసిన విద్యార్థులకు ఇంటర్ చదివేందుకు సంవత్సరానికి రూ.10 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అనంతరం విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న పై చదువులకు రూ.10వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు జులై 15వ తేదీ వరకు www.vidyadhan.org ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలు, వివరాలకు 9663517131, ఇమెయిల్: vidyadhan.telangana@sdfoundationindia.com ను సంప్రదించవచ్చు.