Chandrayaan-3: చంద్రయాన్–3లో ఉండవెల్లి యువకుడు కృష్ణ
ఉండవెల్లి: చంద్రయాన్–3 ప్రయోగాన్ని దేశప్రజలు టీవీల్లో వీక్షించారు. అలాంటిది జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లికి చెందిన మద్దిలేటి, లక్ష్మిదేవిల కుమారుడు కృష్ణ ఇస్రోలో విధులు నిర్వహిస్తున్నారు. చంద్రయాన్–3కు డాటా ప్రాససింగ్ అండ్ అనాలసిస్ అనే వాటిని రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రోలో లాబరేటరి ఫర్ ఎలెక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతను 2008లో ఉండవెల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. పాలిటెక్నిక్ రాశి, కంప్యూటర్ ఇంజినీర్ చేసి 2017లో ఐఎస్‌ఆర్‌ఓ పరీక్ష రాయగా.. ఆల్‌ఇండియాలో 4వ ర్యాంక్ సాధించాడు. చంద్రయాన్–3లో ముఖ్యపాత్ర వహించి విధులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇస్రోలో బాధ్యతలు నిర్వహిస్తుండటంతో గ్రామీణ ప్రజలు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Chandrayaan-3 Live Updates: చంద్రుడిపై చంద్రయాన్–3 అడుగు నేడే
☛ కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడుతున్న కస్తూర్బా విద్యాలయాలు