Inspiring ISRO Scientist: ప్రభుత్వ పాఠశాల నుంచి... చంద్రయాన్–3లో సీనియర్ సైంటిస్ట్ వరకు!
గార్ల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్న ఆయనను సోమవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రయాన్–3... 38 రోజుల ప్రయాణాన్ని విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక శాస్త్రవేత్త అయితే సమాజంలో ఎంత గౌరవం దక్కుతుందో ఈ రోజు తాను కళ్లారా చూ సానని, తనలా కష్టపడి చదువుకుని ఇస్రో శాస్త్రవేత్తలై చంద్రమండలం మీదికి వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అలాగే, తాను చంద్రయాన్–3 రాకెట్ లాంచింగ్‌కు కావాల్సిన మెటీరియల్ విభాగంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నానని తెలిపారు.
Chandrayaan-3: చదువుల్లో రారాజులు... చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తల విద్యార్హతలు ఇవే..!
ఈ ప్రయోగ లక్ష్యం చంద్రుడి దక్షిణార్థ గోళంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే హీలియం ఖనిజాన్ని కనుగొనడమన్నారు. 10 కేజీల హీలియం ఖనిజాన్ని పొందగలిగితే సంవత్సరానికి సరిపడ విద్యుత్‌ను రాష్ట్రానికి అందిచొచ్చని పేర్కొన్నారు. అనంతరం గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు సన్మానించారు.
పాఠశాల హెచ్‌ఎం శీలంశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్ కుమార్‌గౌడ్, ఈశ్వర్‌లింగం, అప్పయ్య, ఉపాధ్యాయులు రమేష్, రమణ, రాము, పద్మావతి, కవిత, సరోజిని, ఫయాజ్ పాల్గొన్నారు.
Aditya L1 Mission: మరో మూడు రోజుల్లో సూర్యుడి చెంతకు ఆదిత్య... బడ్జెట్ ఎంతంటే..!